Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

రక్తదానం మరొకరికి ప్రాణదానం

రక్త బంధం సొసైటీ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్
విశాలాంధ్ర – ధర్మవరం : రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని, రక్తదానం పొందిన వారి జీవితాలలో వెలుగులు నింపే అవకాశం ఉందని రక్త బంధం సొసైటీ నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్త బంధం సొసైటీ మూడు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నామని ఇప్పటివరకు 4000 మంది రక్తదానం చేయడం జరిగిందని, దీంతోపాటు ప్లేట్లెట్స్ 50 మందికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. రక్తదానం ను మూడు నెలలకు ఒకసారి ఇవ్వవచ్చునని, అదేవిధంగా ప్లేట్లెట్స్ అనగా రక్త కణాలు 15 రోజులకు ఒకసారి కూడా ఇవ్వవచ్చునని వారు తెలిపారు. ఏ గ్రూపు రక్తం అయినా అవసరమైన వారికి మా సొసైటీ ద్వారా అందజేయడం జరుగుతోందని తెలిపారు. రక్తదానం ప్లేట్ లెట్స్ లాంటి వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా తల సేమియా వ్యాధిన పడిన వారికి రక్తం ఎంతో అవసరమని వారు తెలిపారు. రక్తం అవసరమున్నవారు ఈ క్రింది సెల్ నెంబర్లకు సమాచారాన్ని ఇస్తే తప్పకుండా మా వంతుగా సహాయం చేస్తామని తెలిపారు. సెల్ నెంబర్.. 9391553146 లేదా 9502904679 కు సంప్రదించవచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img