Friday, June 2, 2023
Friday, June 2, 2023

నారాయణ సేవలో అన్న దానం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ పట్టణంలోని శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి వద్ద భగవాన్ సత్యసాయి బాబా వారి చిత్రపటం ఉంచి పూజలు చేసి హారతులు ఇచ్చి ఆదివారం సంతకు వచ్చినటువంటి గ్రామీణ వాసులకు, యాచకులకు బీదలకు, నారాయణ సేవలో భాగంగా అంబేద్కర్ సర్కిల్లోనూ సుమారు 300 మందికి అన్నదానం, వాటర్ పాకెట్లను ఇవ్వడం జరిగినదనీ. ఈ కార్యక్రమానికి కీర్తిశేషులు గాజుల హనుమంతప్ప రిటైర్డ్ టీచర్ పేరు మీదుగా వారి కుమారుడు మారుతి ప్రసాదు, కుటుంబ సభ్యులు సహకరించి సేవలో పాల్గొన్నారు. మరియు సేవలొ పాల్గొన్న సమితి సభ్యులకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు కలిగి, హనుమంతప్ప సార్ గారి యొక్క ఆత్మ శాంతి కలగాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలకు సేవ భావంతో సహకరించాలని సత్యసాయి సేవా సమితి తాలూకా అధ్యక్షులు శంకర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img