Friday, September 22, 2023
Friday, September 22, 2023

దేవాలయమునకు విరాళం… ఎమ్మెల్యే సతీమణి సుప్రియ

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సిద్దయ్య గుట్టలో నూతనంగా నిర్మించబోయే శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి గాను స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సతీమణి కేతిరెడ్డి సుప్రియ శనివారం తన స్వగృహంలో ఆలయ కమిటీ వారికి 50 వేల రూపాయల నగదు వారు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు సుప్రియ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సుప్రియ మాట్లాడుతూ దేవాలయాలకు తన వంతుగా విరాళం ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉందని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవ సేవను, మానవ సేవలను అలవర్చుకున్నప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img