Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

దానాలల్లోవిద్యా దానం ఎంతో గొప్పది

జిల్లాఎస్పీ పక్కిరప్ప

విశాలాంధ్రబ్యూరో – అనంతపురం : జిల్లా పోలీసు పిల్లల కోసం ” రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు” ప్రారంభించిన జిల్లా ఎస్పీ కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సకల సౌకర్యాలు, సాధనాలు కల్పనఉన్నత విద్యా ప్రమాణాలు కల్గి అర్హులైన టీచర్లు, ఆయాలు నియామకం చేపట్టారు.అనంతపురం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నూతనంగా స్థానిక డిటిసిలో ఏర్పాటు చేసిన “రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు” ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ పక్కిరప్ప మాట్లాడారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం, విద్యా దానాలు గొప్పవి. అందుకే జిల్లా పోలీసు పిల్లలకు మంచి విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టాం
మంచి క్వాలిఫైడ్ టీచర్లను నియమించాం. ప్రీ ప్రైమరీ విద్యకు ఎలాంటి ఢోకా లేకుండా అన్ని వసతులు కల్పించాం.తల్లిదండ్రులు పిల్లలను సకాలంలో స్కూలుకు పంపడం, క్రమశిక్షణతో మెలగడం చేయాలి. స్కూలు పిల్లలకు యూనిఫాం ఉంటుంది.త్వరలోనే ఈ స్కూలు బిల్డింగును సి.పి.సి క్యాంటన్ భవన సముదాయాలకు షిఫ్టు చేస్తాంమన్నారు.
స్కూలు పిల్లల కోసం అవసరమైన బస్సు సౌకర్యాన్ని త్వరలో కల్పిస్తాం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి .ఈ స్కూలులో అడ్మిషన్ కోసం తీసుకుంటున్న మినిమమ్ ఫీజు బ్యాంకులో డిపాజిట్ చేసి భవిష్యత్తులో స్కూలు నిర్వహణకు ఉపయోగిస్తాం.
జిల్లా పోలీసు పిల్లల సంక్షేమంలో భాగంగా ఈ స్కూలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర డిజిపి శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి , అనంతపురం రేంజ్ డి.ఐ.జి శ్రీ ఎం.రవిప్రకాష్ ,సహకరించిన జిల్లా కలెక్టర్ , డి.ఇ.ఓ, ఎం.ఇ.ఓ, ఇతర యంత్రాంగంకు ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ స్కూలుకు టీచర్లుగా నియమించిన పుష్పలత, శిరీష, స్వప్న లకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు జె.రాంమోహనరావు, నాగేంద్రుడు, హనుమంతు, డిటిసి డీఎస్పీ ప్రసాదరావు, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, డీసీఆర్బీ సి.ఐ విశ్వనాథచౌదరి, డి.ఇ.ఓ వెంకటస్వామి, ఆర్ ఐ లు హరికృష్ణ, వెల్ఫేర్ ఆర్ ఎస్ ఐ లు రాజశేఖర్ రెడ్డి, రాజు, రమేష్ నాయక్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్, శ్రీనివాసులు నాయుడు, బెంగుళూరు క్రీడో కంపెనీ ప్రతినిధి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు ఆవిర్భావం చేపట్టారు.
గత నెల 23 న పోలీసు పిల్లల సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారికి ప్రీ ప్రైమరీ స్కూలు కావాలని పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరుసటి రోజే ప్రతిపాదనలు సిద్ధం చేయించి అనతి కాలంలోనే శాశ్వత ప్రాతిపదికన ప్రీ ప్రైమరీ స్కూలు కు అవసరమైన అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయం ద్వారా రిజిష్టర్ చేయించారు. స్థానిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రీ ప్రైమరీ స్కూలుకు అవసరమైన… విద్యార్హతలు కల్గిన ముగ్గురు టీచర్లు, ముగ్గురు ఆయాలను నియమించారు.
స్థానిక డిటిసిలోని రెండు పెద్ద బ్యారెక్ లలో 3 క్లాస్ రూంలు, ఆఫీస్ రూం, ల్యాబ్ లను అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారు
రూ. 5,41,300/- వెచ్చించి బెంగుళూరు నుండీ ప్రీ ప్రైమరీ స్కూలుకు అవసరమైన బెంచీలు, కుర్చీలు, ఆట వస్తువులు, ఇతర సాధనాలు , టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను సమకూర్చారు
నర్సరీ, ఎల్.కె.జి. యు.కే.జీ లకు కలిపి ప్రస్తుతం 31 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఇవే సౌకర్యాలతో రూ. 40 వేలుకు లభించే ప్రీ ప్రైమరీ విద్యను అన్ని రకాల ఫీజులు కలుపుకుని కేవలం రూ. 2,000/- లకే నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేసిన ఎస్పీ పట్ల జిల్లా పోలీసులలో హర్షం వ్యక్తమయ్యింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img