Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొనుటకు దాతలు ముందుకు రావాలి

జిల్లా క్షయ నివారణ అధికారి డా.అనుపమ జేమ్స్

విశాలాంధ్ర- అనంతపురం : వైద్యం క్షయ వ్యాధిగ్రస్తులను ఆరు నెలల పాటు దత్తత తీసుకొనుటకు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని క్షయ నివారణ అధికారి డా. అనుపమ జేమ్స్ కోరారు. శుక్రవారం ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభయాన్ కార్యక్రమములో భాగంగా జిల్లా క్షయ వ్యాధి నివారణా కార్యాలయం అనంతపురం నందు జిల్లా క్షయవ్యాధి నివారణా అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్
ఆధ్వర్యంలో దాతలు కొప్పుల మీనాక్షమ్మ ట్రస్ట్ రవికాంత్ రమణ , వారి మిత్రులు దేవేంద్ర రెడ్డి, శ్రీనివాసులు, సహకారంతో 25 మంది క్షయ వ్యాధి గ్రస్తులను 6 నెలల పాటు దత్తత తీసుకొని వారికి పౌష్ఠిక ఆహార నిమిత్తం 900/- విలువగల ఫుడ్ గ్రైన్స్ మరియు గుడ్ల ను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుపమ జేమ్స్ దాతలను అభినందించారు. ఈ కార్యక్రమములో జిల్లా క్షయ వ్యాధి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img