Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మైకు కూడా ఇవ్వరా..?

విశాలాంధ్ర-రాప్తాడు : ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు మాట్లాడేందుకు మైకు కూడా ఇవ్వరా..? అని టీడీపీ సర్పంచులు ప్రశ్నించారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించగా జెడ్పీటీసీ పసుపుల హేమావతి, ఎంపీడీఓ సాల్మన్, వైస్ ఎంపీపీలు, మండలాధికారులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో ఎంఈఓ మల్లికార్జున విద్యాశాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈఅంశంపై నివృత్తి చేసుకునేందుకు రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాలు పైకి లేచారు. తాను మాట్లాడేందుకు మైకు ఇవ్వాలని సమావేశంలో కోరారు. టీడీపీ సభ్యులకు మైక్ ఇచ్చేది లేదని వైస్ ఎంపీపీ రామాంజినేయులు అనగా ఎందుకు ఇవ్వరని..ప్రశ్నించగా సర్పంచ్ లకు ఈ సమావేశంలో మాట్లాడే అర్హత లేదు అని వైస్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అయన తీరును సర్పంచులు సాకే తిరుపాలు, మిడతల శీనయ్య, బండి ఉజ్జినప్ప, ఎంపిటిసి జాఫర్ ఖాన్ తప్పుబట్టారు. ఒక దళిత సర్పంచుకు సర్వసభ్య సమావేశంలో మాట్లాడేందుకు అర్హత లేదా, వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీల పట్ల ఎంత కపట ప్రేమ ఉందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

వేదికపై ఆసీనులైన అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్న టిడిపి సర్పంచులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img