Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రామ సచివాలయ ఉద్యోగులకు జీతాలను నిలిపివేయాలని ఆదేశించిన డిపిఓ…ప్రభాకర్

గ్రామసచివాలయాన్నిఆకస్మిక తనిఖీచేసిన డిపిఓ
పలుఅధికారులు విధులకు డుమ్మా

విశాలాంధ్ర – అనంతపురం : శెట్టూరు ప్రజల శ్రేయస్సు కోసం గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను నిర్మించి ఏ గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కరించాలని ప్రత్యేకసిబ్బందిని ఏర్పాటుచేసింది అయితే మండల కేంద్రంలో ఉన్న స్థానిక సచివాలయాన్ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆ సమయంలో సచివాలయంలో ఒక్క అధికారి కూడా లేకపోవడం డిపిఓను ఆశ్చర్యానికి గురిచేసింది అందులో భాగంగా పలు రికార్డుల తనిఖీ చేయగా రికార్డుల్లో అధికారుల సంతకాలు లేకపోవడం రికార్డుల్లోతప్పుడుసమాచారాన్ని పొందుపరచి అధికారులు విధులకు డుమ్మా కొట్టారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టినసుస్థిర అభివృద్ధి సర్వేకు సంబందించిన ఎలాంటి రికార్డులు లేకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు గతంలో ఇదే సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిoచారు విధుల పట్ల నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్న అధికారులకు జీతాలను నిలిపివేయాలని డిపిఓఆదేశించారు
సచివాలయ ఉద్యోగులపై తీవ్రంగా మండిపడ్డారు ప్రభుత్వం ప్రవేశ పెట్టె ప్రతి పథకాన్ని ప్రజలకు అందించే దిశగా సచివాలయ అధికారులు విధులు నిర్వహించాలని లేని పక్షాన వారి పై కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img