Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవిని ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు

సత్కరించిన మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : మెడికల్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ అనంత మెడికల్ కళాశాల ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ను మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ అరేపల్లి శ్రీదేవి కి ఇచ్చి శాలువా,జ్ఞాపిక తో సత్కరించారు. ముందుగా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవితో కేకులు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రిన్సిపాల్ ను పెథాలజీ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి డాక్టర్ శివశంకర్ నాయక్ అధ్వర్యంలో లో డాక్టర్ భవాని, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దివ్య, డాక్టర్ శ్రావణి, డాక్టర్ పూర్ణచంద్రశేఖర్, డాక్టర్ చైతన్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, 2కె 20 2కె 21,2కె 22,బ్యాచ్ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ప్రిన్సిపాల్ సన్మానించారు.
ఈ కార్యక్రమంను ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్, సావిత్రిబాయి పూలే మరెందరో ఉత్తమ అధ్యాపకుల స్ఫూర్తితో ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ వృత్తిని ఎంతో బాధ్యతతో నిర్వహించి విద్యార్థులను సమాజ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని తెలిపారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు మాట్లాడుతూ ఉత్తమ క్రమశిక్షణతో, సుమారు 35 సంవత్సరాలు తన జీవితాన్ని ఉపాధ్యాయ వృత్తికి అంకితం చేసి, ఎంతో మందికి ఉత్తమ విద్యను అందించి, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్ది, సమాజానికి మంచి డాక్టర్ లను అందించి, సామాజిక వైద్యశాస్త్ర విభాగానికి ప్రధాన విభాగాధిపతిగా, కళాశాల అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ గా,ఇప్పుడు ప్రిన్సిపాల్ గా నీతి నిజాయితీతో తన విధులను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తున్న మా ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి మేడం ను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో మా ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు సత్కరించడం అభినందనీయమన్నారు. గురువుల పట్ల ఎప్పుడు కృతజ్ఞతలు తో మెలగాలని డాక్టర్ శివ శంకర్ నాయక్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img