Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండలంలోని పలు గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నేత, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి,డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు నాగులుప్పలపాడు ఎంపీపీ క్యాంప్ కార్యాలయంలో ఎంపిపి నలమలుపు అంజమ్మ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వైసిపి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉప్పుగుండూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవరకొండ జయమ్మ, గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసు రాంబాబు, అద్వర్యంలో గ్రంథాలయం సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేర్వనూప్పలపాడు గ్రామ టిడిపి నాయకులు మేడికొండ మురళి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కంచర్ల సుధాకర్ బాబు , పొలినేని కోటేశ్వరరావు , ఎంపీటీసీ పొద పవన్ , ఇస్తర్ల అంజయ్య , వినోదరాయునిపాలెం గ్రామ సర్పంచ్ ఘట్టమనేని అశోక్ , మద్దిసాని నాగేశ్వరరావు , ఈమ్మిశెట్టి బాలకృష్ణ , బోలె అంజనేయులు , నంబూరు నాగయ్య , బోజ్జ దానియేలు , కొండ్రగుంట వేంకటేశ్వర్లు ( బుల్లబ్బాయి),పూరం అంజనేయులు,రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పేరాల చెన్నకేశవులు ,కొంజేటి సురేష్ బాబు, ఉప్పుగుండూరు పంచాయతీ సెక్రెటరీ శ్రీరామమూర్తి, పెంట్యాల శ్రీనివాసరావు,అత్తంటి కోటేశ్వరరావు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img