Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

డాక్టర్ సత్య నిర్ధారణకు ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు కైవసం

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఫెర్రర్ నంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ వ్యవస్థాపకులు, వృద్ధుల సామాజిక ప్రణాళిక రూపకర్త డాక్టర్ సత్య నిర్ధారణకు ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు-2023 మనం ఫౌండేషన్ వారు అందించడం జరిగిందని డాక్టర్ సత్యనిర్ధారన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ధర్మారం తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ, ఎన్నోవేల మంది ప్రజలకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యపై చైతన్యవంతులను చేస్తూ, వైద్య సేవలను కూడా అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఇటీవలే ఫెర్రర్ డూ నంట్ హోమ్ ఫర్ ఓల్డ్ అండ్ డిజేబుల్ సంస్థను స్థాపించడం జరిగిందన్నారు. ప్రారంభ దశలోనే వీటిని గుర్తించి మనం ఫౌండేషన్ వారికి కంబదూరి షేక్ నబి రసూల్ ప్రతిపాదించడం వలన, తనకు అవార్డు అందడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి సహకరించిన స్వచ్ఛంద సంస్థలకు మిత్ర బృందాలకు వారు పేరుపేరునా కృతజ్ఞతలను తెలియజేశారు. అంతేకాకుండా త్వరలోనే ఫిజియోథెరపీ ను అతి తక్కువ ఫీజుతో ఉచిత వసతి భోజనాలతో అందించడం భవిష్యత్తులో జరుగుతుందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img