విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి మండల పరిధిలో ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ వి సుధాకర్ ఉత్తమ వైద్యుడిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, చేతుల మీదుగా కేంద్రం లోని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు అందుకున్నారు. డాక్టర్ సుధాకర్ కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, రోగుల పట్ల అంకితభావంతో పనిచేసి ప్రజల మధ్యనే ఉంటూ వైద్య ఆరోగ్య సేవలను అందిస్తూ ఎంతో కృషి చేసిన డాక్టర్ కు ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.