ఎకరాకు 50 వేల రూపాయలు పంటనష్టపరిహారంఅందించాలి
రైతుల రుణాల వెంటనే రద్దు చేయాలి,,,
సిపిఐజిల్లాసహాయకార్యదర్శి
చిరుతల మల్లికార్జున డిమాండ్
విశాలాంధ్ర-శింగనమల జిల్లా వ్యాప్తంగా పంటలు పెట్టి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని, సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల దగ్గర ఆందోళన పిలుపులో భాగంగా అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామ సచివాలయం దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శి ఎం నల్లప్ప అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమాన్నుద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ! అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితి దాపురించి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు, వరుస కరువులతో అలమటిస్తు న్నటువంటి అనంతపురంజిల్లా రైతాంగానికి ఈ సంవత్సరంలో తీవ్ర కరువు కాటకాలు రావడంతో జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంటలు కూడా వేయనటువంటి పరిస్థితి దాపురించిందని. వేసిన పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగిందని దీని ద్వారా లక్షల రూపాయల పంట భూమి పాలు కావడం జరిగిందని ఈ కరువు కాటకాల వల్ల పశువులకు కూడా పశుగ్రాసం దొరకక ఇబ్బందులు పడుతున్నారన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు, ఇప్పటికే జిల్లాలో పంటలు నష్టపోయి పెట్టుబడులు కూడా రాలేక అప్పుల మీద అప్పులు పెరిగి అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,మాది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని వాపోయారు,ఇంత భయంకరమైన కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ నేటి వరకు ప్రజాప్రతినిధులు గాని అధికారులు గానీ పంట నష్టాన్ని అంచనా వేయడంలో గాని రైతుల్ని ఆదుకుంటామని భరోసా కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్యపరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు, కేవలం కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎలాంటి ప్రకటనైనా చేస్తారేమోనని జిల్లా ప్రజలు రైతులు ఎదురు చూశారు, కానీ ,రైతులకు నిరాశే ఎదురైందన్నారు, జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తక్షణమే ప్రభుత్వం ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందించి రైతులకున్నటువంటి అన్ని రకాల అప్పులను రద్దు చేయాలని, జిల్లాలో కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని, కేంద్ర కరువు బృందాలను రాష్ట్రంలో పర్యటించేటట్టు చేసి ఇతరులను ఆదుకోవాలని, లేనిపక్షంలో జిల్లా రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాగరాజు, రవీంద్ర,శ్రీరాములు, పుల్లారెడ్డి , రామాంజనేయులు, నగేష్, పోలన్న, బ్రహ్మయ్య , మధు, వంశి, ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు,