Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆంధ్రాలో అత్యధికంగా డ్రగ్స్ స్మగ్లింగ్‌.. దేశంలోనే టాప్: కేంద్రం నివేదిక

టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్

విశాలాంధ్ర- గుంతకల్లు : ఆంధ్రాలో అత్యధికంగా మాదక ద్రవ్యాలు డ్రగ్స్ స్మగ్లింగ్ దేశంలోనే అత్యధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చిందని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ అన్నారు ఆదివారం పట్టణంలోని టిడిపి మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు గంజాయి మత్తులో తూగుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో మాదకద్రవ్యాలు పిచ్చలవిడిగా సరఫరా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచక పరిపాలన జరుగుతుందని విమర్శించారు డ్రగ్స్ స్మగ్లింగ్ బెట్టింగ్లు ఇలా అనేక వాటిపై రాష్ట్ర ప్రజల వద్ద నుంచి డబ్బు సొమ్ము చేసుకుంటూ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు డ్రగ్స్ తదితర మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేసులు 571 అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉందని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని తెలిపారు డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాల వల్ల అత్యాచారాలు మానభంగాలు అనేక వాటిపై క్రైమ్ కేసులు కూడా పెరిగాయని వెల్లడించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్ గౌడ్, టిడిపి సీనియర్ నాయకులు కేశప్ప, హనుమంతు, నందీశ్వర్, కురుబ శివన్న, కురుబ సురేష్ ,వీరేష్ ,ఫజులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img