Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఇంటింటా ఓటు సర్వేపై పారదర్శకత్వంతో విధులు నిర్వర్తించాలి…

ఆర్డిఓ తిప్పే నాయక్
విశాలాంధ్ర- ధర్మవరం : నియోజకవర్గంలో ఇంటింటా ఓటు సర్వేపై బిఎల్వోలు పారదర్శకతో విధులు నిర్వర్తించేలా, చర్యలు చేపడుతున్నామని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ తిప్పే నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రాజకీయ గుర్తింపు పొందిన పార్టీలతో వారు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఇంతవరకు ఇంటింటా సర్వేలో వచ్చిన ప్రగతి వివరాలను వారికి తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు నియోజకవర్గంలో 73 శాతము ఇంటింటా ఓటు సర్వే పూర్తి కావడం జరిగిందన్నారు. ఇందులో 71,492 గృహాలను 2,008 మంది బిఎల్వోలు విచారణ పూర్తి చేశారని తెలిపారు. అదేవిధంగా 1,71,228 మంది ఓటర్లను కూడా విచారణ పూర్తి చేశామని తెలిపారు. ఇంటింటా సర్వేలో నియోజకవర్గ వ్యాప్తంగా 671 నమోదుల కొరకు దరఖాస్తులు అన్యాయని తెలిపారు. తదుపరి టిడిపి పార్టీకి చెందిన వారు మాట్లాడుతూ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత బిఎల ఓ ల వారిగా చేర్పుల కొరకు, మార్పులు, తొలగింపుల కొరకు జాబితాను బిఎల్ఓ లకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ యుగేశ్వరీ దేవి, డిప్యూటీ ఎన్నికల తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి, సిబ్బంది రాజకుమార్, వైయస్సార్సీపి పార్టీ, బిజెపి పార్టీ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిడిపి పార్టీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img