Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి


ఆలూరులో బంద్ విజయవంతం

విశాలాంధ్ర – ఆలూరు : విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు మునిస్వామి, టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మనోహర్ యాదవులు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ లో భాగంగా ఆలూరు లో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా రంగాన్ని బ్రష్టు పట్టించారని విమర్శించారు. నాడు పాదయాత్ర లో అనేక మాయ మాటలు చెప్పి, గద్దెనెక్కిన తర్వాత హామీల ఊసే ఎత్తడం లేదన్నారు. నాడు నేడు ద్వారా సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేస్తామని అనేక ప్రగల్బాలు పలికి చివరికి అతని తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనేక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. గతంలో జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థుల కడుపులు నింపుతే, జగన్ మోహన్ రెడ్డి వచ్చాక విద్యార్థుల కడుపులు మాడుస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు దుర్గ నాయక్, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మనోహర్ యాదవ్, వీరాంజి ,ఆదిత్య ,దుర్గా నాయక్, రాజశేఖర్ ,పవన్, సుంకప్ప, ఉపేంద్ర, ఇమనియేల్, వీరాంజనేయులు, సూరి, భరత్, నరసింహ వివేక్ యాదవ్, వినయ్, హాయజ్, జుబేర్, ఉమేష్, చిరంజీవి, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img