Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

గ్రామైఖ్య సంఘం నిదులు దారి మల్లింపు కు యత్నం

. వెలుగు కార్యాలయం వద్ద మహిళల దర్నా

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- మట్టిగుంట జలజీవన్ గ్రామ సమైఖ్య సంఘం లో ఉన్న 40లక్షలకు సంబందించిన నిదులను ప్రక్కదారి పట్టించేందుకు వైయస్సార్ క్రాంతి పదం కార్యాలయం అధికారులు సన్నాహలు చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు నాగులుప్పలపాడు వైయస్సార్ క్రాంతి పదం కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సమైఖ్య సంఘంకు సబందించి క్లస్టరు సిసి లక్ష్మికవిత, ఏపిఎం రవికుమార్ ఇరువురు అదికారపార్టి నాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గి గత ఆరునెలలనుండి గ్రామంలో డ్వాక్రా గ్రూపు సభ్యుల మద్య అనైఖ్యతను సృష్టించి గ్రామ సమైఖ్య సంఘంలో నిల్వ ఉన్న ఘమారు 40లక్షల నిదులను సభ్యుల అనుమతిలేకుండా గ్రామ సమైఖ్య సంఘం కమిటి సభ్యులను మార్పుచేసి డ్రాచేసేందుకు సన్నాహలు చేస్తున్నారన్నారు కార్యాలయ అధికారులు సమాదానం చెప్పేవరకు కదిలేదని భీష్కమించారు దాంతో ఏపిఎం శెలవుపై వెళ్ళడంతో అందుబాటులో లేకపోవడంతో అందుకుసంబందించిన సిసి లక్ష్మి కవిత ను వచ్చి సమాదానం చెప్పాలని పోలీసులు తెలపడంతో దర్నా చేస్తున్న మహిళల వద్దకు వచ్చిన సిసి కొత్తగా మారిన కమిటి సభ్యుల ద్వార ఏర్పడిన కొత్తగా ఒపెన్ చేసి ఎకౌంట్ల ద్వార లావాదేవీలు జరగకుండా చూస్తామని హమీ ఇచ్చారు సంబంధిత బ్యాంకు అధికారులకు లావాదేవీలు జరపకుండా ధర్నా చేస్తున్న గ్రూపు మహిళలు వినతి పత్రం లిఖితపూర్వకంగా అందచేసారు. గ్రామ సమైఖ్య సంఘం సభ్యలతో జూన్ నెలలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి అదేరోజు నూతన కమిటీ ఎన్నుకొని ఆతరువాతనే లావాదేవీలు జరిపేవిదంగా నిర్ణయించి అప్పటి వరకు ఆనిదులకు ఎటువంటి ఇబ్బంది లేదని సిసి హమీ ఇవ్వడంతో మహిళలు దర్నాకార్యక్రమం విరమించారు.
గ్రామ సమైఖ్య సంఘం మహిళలు దర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి నాగులుప్పలపాడు లోని ధర్నా వద్దకు చేరుకొని మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అందరు ఐక్యంగా ఉండి పరిష్కరించుకోవాలన్నారు గ్రామ సమైఖ్య సంఘం సబ్యులకు తెలియకుండా అదికారులు తనఇష్టాను సారంగా సభ్యులను మార్చి సమైఖ్య సంఘంలో నిల్వఉన్న నిదులను ప్రక్కదారి పట్టించేందుకు పూనుకోవడం సరైన పద్దతి కాదని విమర్శించారు ఇప్పటికైన అటువంటి విదానం మానుకోవాలని లేనిచో మహిళలను పెద్దఎత్తున సమీకరించి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలు చేసే న్యాయమైన పోరాటానికి సిపియం, తెలుగు దేశం పార్టి ల నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img