Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ధర్మవరంలో 13వేల దొంగ ఓట్లను తొలగించండి

తాడిమర్రి మండలంలో క్రషర్ మిషన్ ఏర్పాట్లు నిలిపివేయండి

ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర – ధర్మవరం:: ధర్మవరంలో 13వేల దొంగ ఓట్లను తొలగించాలని, ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో క్రషర్ మిషన్ ఏర్పాటను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్కు పరిటాల శ్రీరామ్ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ జిల్లేడుబండ ప్రాజెక్టు, తాడిమర్రిలో కూల్చివేసిన ఇళ్లకు పరిహారంపై కూడా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ధర్మవరం నియోజకవర్గంలో సుమారు 13వేల దొంగ ఓట్లను ఓటర్ జాబితాలో చేరుస్తున్నారని.. దీనికి అడ్డుకట్ట వేయాలని తెలిపారు. నియోజకవర్గంలోని పలు అంశాల మీద చర్చించడం జరిగిందన్నారు. ఈ నాలుగు అంశాలపై కలెక్టర్ కు వినతి అందజేస్తూ న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఇందులో మొదటి అంశాన్ని పరిశీలిస్తే… తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామ పంచాయతీ పరిధిలో కంకర క్వారీ, క్రషర్ మిషన్ అనుమతులు రద్దు చేయాలని , గ్రామ ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, ప్రజల అభిప్రాయాన్ని సేకరించకుండా సుమారు 3 హెక్టార్ల విస్థీర్ణంలో అధికార పార్టీ నాయకుల ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు కంకర క్వారీ, కంకర క్రషర్ మిషన్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు మంజూరు చేసినట్లు వివరించడం జరిగిందన్నారు ఇక్కడ క్వారీ, క్రషర్ మిషన్ ఏర్పాటు చేస్తే క్వారీలో బ్లాస్టింగ్ చేసినపుడు పంటపొలాల్లో పనిచేస్తున్న కూలీలు ప్రమాదానికి గురవడంతో పాటు , రైతుల పంట పొలాల్లోని డ్రిప్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ మోటర్లు కూడా నాశనం అవుతాయన్నారు. క్రషర్ చేసినపుడు విపరీతంగా ధూళి, చిన్న ఇసుక రేణువులు గాలిలో కలసి పంట పొలాల మీద పడి పంట ఎదుగుదలకు ఆటంకం కలిగి, పంటలకు తెగులు సోకి పంటలు పండకుండా పోతాయన్నారు. రైతులు దీనిని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అదే విధంగా పురాతమైనటువంటి అక్కమ్మగార్ల గుడి ఈ కొండలో ఉందని, ఇక్కడ పది గ్రామాల ప్రజలు నిత్యం పూజలు, తరచు జాతర్లు జరుగుతూ ఉంటాయి అని,క్వారీ వలన గుడి ధ్వంసం అవుతుందని ఈ పది గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.2023వ సంవత్సరం, జనవరి 5వ తేదీన వెల్లండించిన ఓటరు జాబితా ప్రకారం.. నియోజకవర్గంలోని 287పోలింగ్ బూత్ లలో ఓటరు జాబితాను టీడీపీ బీఎల్ఏలు పరిశీలించారని.. ఇందులో డబుల్ ఓట్లను, మరణించిన వారి ఓట్లను, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను చేర్చినట్టు గుర్తించడం జరిగిందన్నారు. ఈ వివరాలను కలెక్టర్ కు అందజేశామనీ తెలిపారు.అధికారుల ద్వారా పరిశీలించి, ఓటర్ జాబితాలో ఉన్న డబుల్ ఓట్లను, మరణించిన వారి ఓట్లను, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించాలని తెలిపారు. లేని పక్షంలో ఇది అధికారపార్టీ నాయకులు దొంగ ఓట్లుగా మలుచు కొనే అవకాశం ఉందన్నారు
మరోవైపు ముదిగుబ్బ మండల పరిధిలోని గుడ్డంపల్లి తాండా సమీపంలో నిర్మిస్తున్న జిల్లేడు బండ రిజర్వాయర్ వలన సుమారు 2500 ఎకరాల భూములు ముంపునకు గురి అవుతున్నాయని.. సంబంధిత రైతులకు సరైన పరిహారం ఇవ్వలేదని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణకు సంబంధించిన విధివిధానాలను అనుసరించకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, రైతులకు ఒక ఎకరాకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారు అని తెలియచేయకుండా, ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం సరైన పద్ధతి కాదని తెలిపారు. కావున దీనిపై విచారణ చేసి..ఈ ప్రాజెక్టు పరిధిలో ఎన్ని వేల ఎకరాల భూములు అవసరం అన్నది తెలిపి, గ్రామ సభలు నిర్వహించి, సేకరించిన ప్రతి ఎకరాకు నష్టపరిహారం నిర్ణయించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. తాడిమర్రి మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పేరుతో 86 మంది ఇళ్లు కూల్చివేశారని.. వారు రోడ్డున పడేలా చేశారన్నారు. వీరికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం అందజేయలేదని.. తెలిపారు. పంచాయతీ, ఆర్.అండ్.బి వారు పరిహారం విషయంలో పొంతన లేని సమాధానాలు చెప్పడం అన్యాయమని, బాధితులకు అన్యాయం చేయడం జరుగుతోందన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి స్థానిక రెవెన్యూ అధికారులతో పూర్తి సమాచారం సేకరించి, వ్యాపార, నివాస గృహాలు కోల్పోతున్న బాధితులకు పరిహారం మంజూరు చేయించడంతో పాటు, వారికి వేరే ప్రాంతంలో ఇళ్ల పట్టాలు మంజూరు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ నాలుగు అంశాల మీద కలెక్టర్ సానుకూలంగా స్పందించారని.. విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img