విశాలాంధ్ర -ధర్మవరం : ఉద్యోగస్తులు సేవతో కూడిన విధులు నిర్వర్తించినప్పుడు, ప్రభుత్వానికి, కార్యాలయమునకు, మంచి గుర్తింపు లభిస్తుందని ఎంపీడీవో సౌజన్యకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలను మండల అధ్యక్షులు గిలక రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. రమాదేవి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని, వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న సురక్ష కార్యక్రమము, నా భూమి- నా దేశం, తదితర కార్యక్రమాలలో మండలంలో ప్రతిభ ఘనపరిచినటువంటి పంచాయితీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి, ఉపాధి హామీ సిబ్బందికి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బందికి, మండల అధ్యక్షులు చేతులమీదుగా బహుమతులను ప్రధానం చేశారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు కుమార్తె హాసిని జగనన్న విద్యా దీవెన పథకం కింద విదేశీ విద్యను అభ్యసించడానికి ఎంపికైన సందర్భంగా ఎంపీపీ గిలక రమాదేవి ఆ అమ్మాయిని ఘనంగా సత్కరించారు. అంతే కాకుండా మండల కార్యాలయము ఉపాధి హామీ సిబ్బంది అందరూ కలిసి ఆమెకు నగదు రివార్డులు కూడా ప్రకటించారు. కార్యక్రమంలో ఈఓఆర్డి మమతా దేవి, ఏవో. నబి రసూల్,సీనియర్ అసిస్టెంట్ శంకర్ రెడ్డి,ఏపీఓ అనిల్,మండల నాయకులు, సంఘాలప్ప, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.