Friday, April 19, 2024
Friday, April 19, 2024

అర్హత ప్రమాణాలు లేని ఉద్యోగులు ల్యాబ్ అసిస్టెంట్లుగా చలామణి ?

ఎన్ బి ఏ పరిశీలనతో కళాశాలలో సంస్కరణ..
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ : పుస్తకాల్లో చదివిన అంశాలను వాస్తవిక కోణంలో అధ్యయనం చేసేందుకు
ల్యాబ్ పరిశోదాత్మక ఆవిష్కరణలకు నాంది పలికే.. సమాజ నిర్మాణానికి ముఖ్య భూమిక పోషించే ల్యాబ్ కేంద్రాలలో అర్హత ప్రమాణాలు గాలికొదిలేసి అర్హత లేని వారు ఉద్యోగులుగా విధుల్లో చేపట్టారు అంటే కళాశాల పరిపాలన అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లం అవుతుంది. ల్యాబ్ అసిస్టెంట్ కు అర్హత ప్రమాణాలు ఐటిఐ లేదా పాలిటెక్నికల్ డిప్లమా.. మొదలగు అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి కానీ లేకుండానే ఉద్యోగులుగా చలామణి అయ్యారు. సోమవారం ఎన్ బి ఏ పరిశీలనతో కళాశాలలో అర్హత ప్రమాణాలు లేని ఉద్యోగులను వారి అర్హతలకు తగ్గట్టుగా విధులు ను కేటాయించి వేగవంతంగా సంస్కరణకు శ్రీకారం చుట్టారు.. అయితే కొందరు ఉద్యోగులకు మాత్రం రాజకీయ నేతలు, మాజీ వీసీలు, ప్రొఫెసర్ల, మాజీ ఉద్యోగులు అండదండలతో మినహాయింపు ఇవ్వడం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అర్హత ప్రమాణాలకు తగినట్లుగా అందరికీ సమాన అవకాశాలను కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img