చిలకం ఛాయాదేవి
విశాలాంధ్ర – ధర్మవరం : ఉపాధి హామీ పనులతోనే గ్రామీణులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమ్ మధుసూదన్ రెడ్డి సతీమణి చిలకమ్ ఛాయాదేవి పేర్కొన్నారు. మండల పరిధిలోని రేగాటిపల్లి పంచాయతీ లోని ఉపాధి హామీ పనులను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి సతీమణి శ్రీమతి చిలకం ఛాయదేవి ప్రారంభించారు. అనంతరం ఛాయాదేవి మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, కుటుంబానికి ఎంతో ఉపయోగపడతాయని, కుటుంబ జీవన విధానం సులభతరం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులకు వెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు చిలకమ్ మధుసూదన్ రెడ్డి అభిమానులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.