సీపీఐ నాయకులు డిమాండ్
విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి కొండాపురం కొత్తపల్లి గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలని సిపిఐ నాయకులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయితీగా వున్నప్పుడు ఉపాధి పథకము క్రింద దాదాపుగా 5000 వేలు జాబ్ కార్డు కలవు మరియు జాబ్ కార్డు వున్న ప్రతిఒక్కరు ఉపాధి హామీ పథకము క్రింద కూలీ పనులు చేసుకొని జీవనము కొనసాగించువారు, 2012సం లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి పామిడి గ్రామ పంచాయితీని నగర పంచాయితీగా మార్చడము జరిగినది.అప్పటి నుండి ఉపాధి హామి పథకము క్రింద పనులు ప్రభుత్వం వారు పనులు నిలిపి వేసినారు. గ్రామ పంచాయితీగా వున్న గ్రామంలో వున్న వారికి మాత్రమే ఉపాధి హామి పనులు కల్పించబడున అని అధికారులు తెలియచేయడము జరిగినది. మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు పామిడి నగర పంచాయితీలో వ్యవసాయ కూలీలు పని లేక కొంత మంది వలసలు పోవడం జరిగినది, మరికొంత మంది పనులు లేక కష్టలు పడుచున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వము పామిడి |నగర పంచాయితీని తిరిగి నవంబరు నెల 2021సం లో పామిడి పంచాయితీగా మార్చడము జరిగినది. దాదాపు 2 సం గడిచిన మన పామిడి గ్రామ పంచాయితీలో ఉపాధి హామి పథకము అమలు చేయడము లేదు. చాలాసార్లు అర్జీలు ద్వారా తెలియజేసిన స్పందించలేదు. పామిడి గ్రామ పంచాయితీలో పామిడి, కొత్తపల్లి, కొండాపురం గ్రామములో నివసించే వ్యవసాయ కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వము మన పామిడి మండలం కరువు మండలముగా ప్రకటించినారు. కాని ఇంతవరకు పామిడి మండలములో కరువు పనులు చేపట్టాలేదు. పామిడి గ్రామ పంచాయితీలో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామి పథకము క్రింద పనులు వెంటనే కల్పించవలసిందిగా కోరారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బద్రి స్వామి,రహీం,నాగరాజు, చౌడప్ప,సిపిఎం అనిమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు