Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శక్తి వనరుల ను పొదుపుగా వాడాలి

శక్తి వనరుల వినియోగంపై మెడికల్ కళాశాలలో అవగాహన కార్యక్రమం
అతిగా శక్తి వినియోగం అత్యంత ప్రమాదకరం

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ మైరెడ్డి నీరజ

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : శక్తి వనరుల వినియోగంపై ప్రభుత్వ వైద్య కళాశాల సెంట్రల్ హాలులో వైద్య విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ మాట్లాడుతూ శక్తి వనరులైన విద్యుత్తు ను, నీటిని పొదుపుగా వాడుకోవాలని, అతిగా వినియోగించడం ద్వారా విద్యుత్ కొరత నీటి కొరత ఏర్పడుతుందని, అందుకే అనవసరంగా విద్యుత్తును నీటిని వినియోగించరాదని, మనం వినియోగించినప్పుడు వాటిని నిలుపుదల చేయడం ద్వారా విద్యుత్ శక్తిని అదుపు చేయవచ్చని, అవగాహన లేకపోవడం ద్వారా మన సమాజంలో చాలామంది, ఇండ్లలోను, ఆఫీసులోనూ, ఆరు బయట ప్రదేశాలలోనూ అనవసరంగా శక్తి వినరులను వినియోగిస్తున్నారని అది అత్యంత ప్రమాద సంకేతకాలకు దారితీస్తుందని, అందుకే వైద్య విద్యార్థిని విద్యార్థులను ప్రతి ఒక్కరూ కనీసం పది మంది కుటుంబాల గృహాలలో ఈ శక్తి వినియోగం వాడకంపై ఒక సర్వే చేయిస్తున్నామని, దీని ద్వారా యువతకు మరియు సమాజంలోని వ్యక్తులకు ఒకేసారి అవగాహన కలుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ త్రు ఎడ్యుకేషన్ (విద్యుత్ ద్వారా సమాజ అభివృద్ధి మండలి) ని ఏర్పాటు చేసిందని, ఈ బోర్డు కు సెక్రటరీ మరియు సీఈవోగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ ఎమ్ ఎల్ ఎస్ దేవకుమార్ గారు, డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులు కుటుంబాలలో అవగాహన కలిగించడానికి ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. మెడికల్ కళాశాల అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి, డాక్టర్ షారోన్ సోనియా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు శక్తి వినియోగం తగ్గుదలపై మెడికోలకు అవగాహన కలిగించారు. శక్తి వినియోగం పై వైద్య విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను శనివారం నిర్వహించి ప్రశంసా పత్రాలను మెడల్స్ ను అందజేయనున్నారు. రేపటి నుంచి వైద్య విద్యార్థులు మెడికల్ కళాశాలకు దగ్గరలో ఉన్న కుటుంబాలకు శక్తి వినియోగం తగ్గుదలపై అవగాహన కలిగిస్తారనీ ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img