విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎంటెక్ ఒకటవ సెమిస్టర్ (అర్21) రెగ్యులర్ , సప్లిమెంటరీ ఫలితాలు , ఒకటవ సెమిస్టర్ (ఆర్17), రెండవ సెమిస్టర్ (అర్21) మరియు (ఆర్ 17) సప్లిమెంటరీ పరీక్ష పలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ అఫ్ ఎవాల్యు యేషన్ ఆచార్య ఇ. కేశవరెడ్డి , కంట్రోలర్ అఫ్ ఎక్సామినేషన్ ఆచార్య బి. చంద్ర మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పరీక్షా పలితాల కోసం జేఎన్టీయూ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.