ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్
విశాలాంధ్ర-అనంతపురం : ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి చేస్తశానిటేషన్ కార్మికుల ఈ ఎస్ ఐ, ఈ పి ఎఫ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్. రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్ల సమస్యలపై మూడవరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… గత నాలుగు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలి అన్నారు. మూడు సంవత్సరాలుగా ఏ 1 సర్వీసెస్ వారు కార్మికులకు బకాయిల్లో ఉన్న ఈపీఎఫ్ నగదును జమ చేయాలని పేర్కొన్నారు. ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలన్నారు., జీవో నెంబర్ 549 ప్రకారం నెలకు 16 వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.bఅనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపర్డెంట్ సుబ్రహ్మణ్యం కు అందజేశారు అందజేశారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ స్పందిస్తూ…. మీ సమస్యలను పై అధికారులకు దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు జి చిరంజీవి, వికే కృష్ణుడు,ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి. ప్రకాష్, జిల్లా కార్యదర్శి మనోహర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్, కృష్ణ భార్గవి, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.