Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

వ్యాసరచన పోటీలు

విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని విజయనగర్ కాలనీలోని పద్మవాణి హై స్కూల్ నందు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా వ్యాసరచన పోటీలు, వకృత్వ పోటీలను యల్లనూరు రోడ్డు సర్కిల్ లో ఉన్న అనంత గ్రామీణ ప్రగతి బ్యాంక్ మేనేజర్ సివిఎన్ రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి పాఠశాల కరస్పాండెంట్ నాగపీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరు కూడా బ్యాంక్ అకౌంట్ వివరాలను ఓటీపీని ఇతరులకు షేర్ చేయరాదన్నారు. బ్యాంకు వారు ఈ విషయాలను ఎవరిని అడగరు అన్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకుల కన్నా గ్రామీణ ప్రగతి బ్యాంక్ డిపాజిట్ పై అత్యధిక వడ్డీ ఇస్తుందన్నారు. గృహ, విద్యాపరమైన, వ్యాపార రుణాలను అందిస్తుందని చెప్పారు. ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లేనియెడల బ్యాంక్ అకౌంట్ ను తెరిచి ఏటీఎం కార్డును తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించుటకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, పోటీ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ మహబూబ్ భాషా, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img