Friday, December 2, 2022
Friday, December 2, 2022

ప్రతి వ్యక్తి ఊరి పరిశుభ్రత కోసం పాటుపడాలి

విశాలాంధ్ర-తాడిపత్రి: గ్రామంలోని ప్రతి వ్యక్తి ఊరి పరిశుభ్రత కోసం పాటు పడాలని మిద్దె చిన్న పుల్లారెడ్డి కుమారుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీరామ్ రెడ్డి సూచించారు. శనివారము గ్రామంలో కలయ తిరిగి ఊరు బయట రహదారులలో బహిర్భూమికి వెళ్లే వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామం లోని ప్రతి వ్యక్తి ఊరి పరిశుభ్రత కోసం మల్ల, మూత్ర విసర్జన కోసం బహిర్ భూమికి వెళ్ళరాద న్నారు. తమ గృహాలలో ఉన్న మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బహిరంగంగా రహదారుల్లో మలమూత్ర విసర్జన చేయడం వల్ల రహదారి పై వెళ్లే పాదాచార్లకు దుర్వాసన వెదజల్లుతుందన్నారు. గ్రామంలోని ప్రతి వ్యక్తి శుభ్రత పరిశుభ్రత పాటిస్తూ గృహాలలోని మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img