Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ప్రతి గర్భిణీ కి హెచ్. ఐ. వి పరీక్ష నిర్వహించాలి

డి. యం. హెచ్. ఓ.

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా స్థాయి ఈ ఎం టి సి టి కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వీరబ్బాయి అధ్యక్షతన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయములో మంగళవారం నిర్వహించారు . ఈ సమావేశములో జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టి. బి. అధికారి డా. అనుపమ జేమ్స్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గర్భిణీ స్త్రీ మొదటి త్రైమాసికం లో ఇతర రక్త పరీక్షలతో పాటు హెచ్.ఐ.వి. పరీక్షలు చేయించుకొనేలా ప్రోత్సహించాలని ఐ.సి.టి.సి. మరియు క్షేత్ర స్థాయి సిబ్బందికి తెలియచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వీరబ్బాయి మాట్లాడుతూ… గర్భిణీ స్త్రీలతో పాటుగా వారి యొక్క భర్తలకు కూడా హెచ్.ఐ.వి. పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెచ్. ఐ.వి.తో పాటు సిఫిలిస్, హెపిటైటిస్ బి, సి పరీక్షలు కూడా నిర్వహించాలని కోరారు. హెచ్. ఐ. వి. తో జీవిస్తున్న మహిళలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు గురించి ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకురాగా, తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. సాథీ స్టేట్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ భాను మాట్లాడుతూ ప్రైవేటు నర్సింగ్ హోమ్ లలో హెచ్.ఐ.వి. పరీక్షలలో పాజిటివ్ అని గుర్తించిన వారిని ప్రభుత్వ ఆసుపత్రుల లోని ఐ.సి.టి.సి. కేంద్రాలకు పంపినట్లయితే వారికి హెచ్.ఐ.వి. నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ అని గుర్తించిన వారికి ఉచితంగా ఏ. ఆర్. టి. మందులు అందే లాగా చర్యలు తీసుకోవచ్చని, తద్వారా తల్లి నుండి బిడ్డకు హెచ్. ఐ. వి రాకుండా చూసుకోవచ్చని, ఆ మేరకు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ సమావేశం లో ఫ్యామిలీ డాక్టరు నోడల్ అధికారి డా. వి. సుజాత, ఫోగసి ప్రెసిడెంట్ డా. వి. అరుణ, అప్నా ప్రెసిడెంట్ డా. విజయ కుమార్, అప్నా సెక్రెటరీ డా. రవి శ్రీనివాస్, ఏ.ఆర్.టి. వైద్యాధికారులు డా. సత్యనారాయణ, డా. హేమంత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ మారుతి ప్రసాద్, సాథీ స్టేట్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ భాను, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ డి.పి.యం. వెంకట రత్నం, అనంత నెట్వర్క్ వీరాంజనేయులు, సాథీ సంస్థ పి ఒ శేషాద్రి, ఆర్ డి టి సిబ్బంది, ఏ.ఆర్.టి. కేంద్రాల కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img