Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ప్రతి విద్యార్థి హిందీ భాష యొక్క ప్రాధాన్యతను తప్పనిసరిగా తెలుసుకోవాలి..

హిందీ పండిట్- వేణుగోపాలచార్యులు
విశాలాంధ్ర -ధర్మవరం:: హిందీ భాష యొక్క ప్రాధాన్యతను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని హిందీ పండిట్ వేణుగోపాలాచార్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ హిందీ భాష దినోత్సవ సందర్భంగా, హెచ్ఎం శైలజ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ హిందీ భాష జాతీయ భాషగా మహాత్మా గాంధీ ఆలోచనతో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 343 (1) ప్రకారం జాతీయ భాషగా, అధికార భాషగా పొందుపరచడం జరిగిందన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అని, అందరికీ అనుసంధాన బాసగా, ప్రాంతీయ భాషా బేధం కాకుండా, అందరినీ ఒక్కటిగా భారతీయ అఖండతకు తోడ్పడుతుందని తెలిపారు. హిందీ భాషను పాఠశాల స్థాయి నుండి త్రిభాషా సూత్రాన్ని, కొరాటి కమిషన్ సూచన మేరకు నేర్పించిన విద్యార్థులతో జాతీయ భావనతో, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలన్నారు. భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడుటకై దోహదం కాగలదని సరళమైన మధురమైన భాషగా నేర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. తదుపరి విద్యార్థులైన పార్థసారథి, అరవిందు, శ్రీనాథ్ లు హిందీ భాష గురించి తమదైన శైలిలో తమ ఇష్టాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తులసి కుమారి, ప్రసాదు, నాగేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img