విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతి విద్యార్థి నేత్రదానం అవయవదానంపై అవగాహన ఉండాలని అమ్మ బాడీ ఆర్గాన్ ఐ డొనేషన్ ఆర్గనైజేషన్ ప్రమోటర్సఫౌండర్, అధ్యక్షులు- గంజి ఈశ్వర లింగం, చీఫ్ అడ్వైజర్ సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు నేత్రదానం అవయవ దానంపై అవగాహన సదస్సులు యువర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర లింగం, సుబ్బరాజు మాట్లాడుతూ అవయవ దానాలలోని పలు రకాలను గూర్చి వారి వివరించారు. ఇందులో భాగంగా గుండెను దానం చేయడం ద్వారా పలువురికి పునర్జన్మను ఇచ్చినట్లు అవుతుందని, నేత్ర దానం వల్ల ఇరువురికి కంటిచూపు వచ్చే అవకాశం ఉందని, ఎక్కడైనా సరే వ్యక్తి మరణించాక ఆరు గంటల లోపు నేత్రదానం చేయవచ్చునని తెలిపారు. ఇక అవయవ దానములో బ్రతికి ఉండగానే ఒక వ్యక్తి ఒక కిడ్నీని కాలేయంలో కొంత భాగాన్ని కూడా దానం చేయవచ్చునని తెలిపారు. దేహదానములో మరణానంతరం మృతదేహాన్ని కుటుంబముల అనుమతితో మొత్తం శరీరంలోని అవ యవాలను దానం కూడా చేయవచ్చునని తెలిపారు. చర్మ దానములో మరణానంతరం చేసే దానమని అంటారు.. వీపు పొట్ట తొడలు కాళ్లపై ఉండే చర్మాన్ని మరణానంతరం ఇవ్వవచ్చునని తెలిపారు. తదుపరి దేశ దానం జుట్టు దానం క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకునే వారికి జుట్టు రాలిపోతుందని, ఈ కారణంగా కేశ చెట్టు దానం చేసిన వారి వెంట్రుకలను వీరికి విగ్గు ద్వారా పెట్టడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఆసక్తి గలవారు కేశదానం, జుట్టు దానం చేయాల్సివస్తే ఇంటి వద్ద కత్తిరించి, పోస్టు, కొరియర్ ద్వారా కూడా పంపవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పనింద్ర, యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు వై కే శ్రీనివాసులు, కార్యదర్శి సుంకు సుకుమార్ , ఆప్తాలిక్ అసిస్టెంట్ సికిందర్ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.