సీడీపీఓ శర్మిష్ఠ
విశాలాంధ్ర – వలేటివారిపాలెం : ప్రతి ఒక్కరూ పోషకాహారంపై అవగాహన పెంచుకుని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని సీడీపీఓ శర్మిష్ఠ సూచించారు. మండలంలోని అత్తంటివారిపాలెం గ్రామంలోని అంగన్వాడీ-2 కేంద్రంలో పోషణ మహా ఉత్సవం కార్యక్రమాన్ని సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ పోషణమహా ఉత్సవం కార్యక్రమం సెప్టెంబర్ 1వతేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్బంగా పోషక విలువల గల ఆహార పదార్థాల గురించి వివరించారు.విటమిన్స్, ప్రోటీన్లు, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషణ విలువలు ఏ ఆహార పదార్థాల్లో లభిస్తాయో గర్భణీలకు, బాలింతలకు, తల్లులకు తెలియజేశారు. మహిళలు రక్తహీనత బారిన పడకుండా ఆకుకూరలు, కూరగాయలను సమృద్ధిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం పోషకాహార ప్రతిజ్ఞ ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పి.భారతి,కె.రాధ,పి.రమ,కె. మనోహర,హెల్పర్ జె.లక్ష్మి, తల్లులు తదితరులు పాల్గొన్నారు.