Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ప్రతి ఒక్కరూ ఓటరు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి..

ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తిప్పే నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రతి ఒక్కరూ ఓటరు గుర్తింపు కార్డు కలిగి ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి విధిగా ఓటరు కార్డు నమోదు చేయాలని ఆర్డీవో, ఎలక్ట్రాల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో వారు ఓటర్ సర్వే పై సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఈనెల 27వ తేదీ వరకు నియోజకవర్గంలో ఓటర్ సర్వే ప్రగతి వివరాలను వారు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తము 2,30,796 ఓట్లు ఉన్నాయని ఇప్పటివరకు సర్వేలో 12,969 పూర్తి చేశామని తెలిపారు. ఇందులో నియోజకవర్గంలోని ధర్మవరం,బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో నూతన ఓటర్లు 291, తొలగింపులు 26, మార్పులు, చేర్పులు243 కలవని తెలిపారు. అనుకున్న షెడ్యూల్ తేదీ ప్రకారం తప్పక పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఓటు సర్వేలో బిఎల్ఓ లు కీలకపాత్ర వహించాలని తెలిపారు. ఓటర్ సర్వేలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు, బిఎల్ఏలు సహాయ సహకారాలు అందిస్తూ, నియమ నిబంధనల ప్రకారం ఓటర్ సర్వేను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కడ కూడా దొంగ ఓటుకు తావూ ఇవ్వరాదని, అలా చేస్తే ఎన్నికల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఓటర్ సర్వే కార్యక్రమం ఈనెల 21వ తేదీ నుండి ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించబడునని తెలిపారు. ప్రజలు కూడా మీ వద్దకు వచ్చే అధికారులకు సహాయ సహకారాలు అందించి, ఓటు సర్వేను విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం కొందరు రాజకీయ పార్టీ నాయకులు ఓటు నమోదు తొలగింపు, చేర్పులు, మార్పులు విషయంలో పలు అనుమానాలను తెలియజేశారు. వాటికి ఆర్డిఓ ఆ అనుమానాలకు నివృత్తి చేశారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు రానివ్వరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఉప తాసిల్దార్ అనిల్ కుమార్ రెడ్డి, సిబ్బంది రాజ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img