Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలి… ధర్మాచార్యులు నక్కల వెంకటేష్

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటే, మనశ్శాంతి సుఖవంతమైన జీవితం లభిస్తుందని టీటీడీ ధర్మాచార్యులు నక్కల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూరల్ పరిధిలోని పోతుకుంట గ్రామంలో గల ఎస్సీ కాలనీలో గత మూడు రోజులుగా అక్కడ వెలిసిన శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించు ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉపన్యాస కార్యక్రమాలు మూడు రోజులపాటు నిర్వహించారు. అనంతరం శ్రీవారి దివ్య చరితము యొక్క ప్రవచనం చేశారు తిరుమల కొండలలో వెలిసిన ఏడుకొండల యొక్క విశిష్టత విశిష్టతను కూడా తెలియజేశారు. తదుపరి అమ్మవారిని వివిధ పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరదరాజులు ఆంజనేయులు నరేంద్ర లక్ష్మీదేవి నాగమణి ఈశ్వరమ్మ భక్తాదులు పాల్గొని భజనలను నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు నక్కల వెంకటేశుని శాలువాతో సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img