ఓసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్ధన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రాజ్యాంగ బద్దంగా కల్పించిన పది శాతం రిజర్వేషన్స్ పక్కాగా అమలు పరచాలని ఓసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్రా జయవర్ధన్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మా కోటా వాటా వెంటనే అమలు చేసి, విద్యా ప్రవేశాల్లో అమలు చేయాలనీ అయన డిమాండ్ చేసారు. కూటమి ప్రభుత్వం ఓసీ లను, మా కోటాలను విస్మరించకుండా , అమలు చేయాలనీ లేని పక్షం లో రోడ్డెక్కాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. 2018 లో కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి ఇతర వర్గాలకు ఎటువంటి నష్టం లేకుండా రాజ్యాంగ బద్దంగా పార్లమెంట్ సాక్షి గా పది శాతం రిజర్వేషన్స్ ఇస్తే దేశావ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పక్కాగా అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విస్మరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.అన్ని విద్యా, ఉద్యోగ ప్రవేశల్లో భవిష్యత్ లో ఎటువంటి ఆటంకం లేకుండా అగ్రకుల పేదలకు రిజర్వేషన్స్ అమలు చేయాలనీ లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడతామని అయన హెచ్చరించారు.