మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున
విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణములోని ప్రజలందరూ పురపాలక సంఘమునకు బకాయి ఉన్న ఆస్తి కాళీ జాగా పన్నులకు వడ్డీ మాఫీ కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉందని అనగా ఈనెల 31వ తేదీ లోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మంగళవారం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న పాత బకాయిలు పన్నుపై విధించిన వడ్డీని ఏక మొత్తంగా మాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వడ్డీ మాఫీ పొందాలనుకునేవారు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరముతో సహా ఒకేసారి ఏక మొత్తంగా ఈనెల 31వ తేదీ చెల్లించినట్లయితే వడ్డీ మినహాయింపు తప్పక వర్తిస్తుందని తెలిపారు. కావున ఆస్తి పన్ను చెల్లింపు దారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తాము చెల్లించే పనులను ఆన్లైన్ ద్వారా గాని, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డుల ద్వారా గాని, యూపీఐ ద్వారా గాని, మున్సిపల్ కార్యాలయము నందు గాని పార్థసారధి నగర్ సచివాలయం-2 నందు గాని, ఎల్పీ సర్కిల్ నందు గల సచివాలయం, గీతా నగర్ సచివాలయంలో చెల్లించవచ్చునని తెలిపారు. పై విధంగా పన్ను చెల్లింపుదారులు త్వరపడి మీ బకాయిల మొత్తాన్ని వెంటనే చెల్లించి, వడ్డీ మాఫీ లబ్ది పొందాలని తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు ఆస్తి పన్ను 9 కోట్ల 6 లక్ష్యాలకు గాను ఏడు కోట్ల పదహారు లక్షలు వసూలు కాగా 1 కోటి 90 లక్షలు బకాయి ఉన్నదని 79.03 శాతము కాగా, నీటి పన్ను ఎనిమిది కోట్ల 60 లక్షలు ఉండగా 4 కోట్ల 86 లక్షలు వసూలు కాగా బకాయి 3 కోట్ల 74 లక్షలు బకాయి ఉండగా 56.51 శాతం నమోదయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, ఆర్వో.. ఆనంద్ పాల్గొన్నారు