Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

సమాచార స్వేచ్ఛ కోసం సమాచార హక్కును అమలు చేయండి

సమాచార హక్కు జిల్లా కన్వీనర్ హబీబ్ ఉర్ రహమాన్

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణము మండల వ్యాప్తంగా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉన్నటువంటి సమాచార హక్కు చట్టంపై అవగాహన సక్రమ రికార్డుల నిర్వహణ కోసం విధిగా అమలు చేయాలని సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ హబీబ్ఊర్ రహమాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మంగళవారం పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన 120 రోజులలో ప్రతి కార్యాలయము నందు 17 అంశాలపై ప్రచురించాలని తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణము, మండల పరిధిలోని కార్యాలయాలు, పాఠశాలల్లో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు- ప్రజా చైతన్య వేదిక సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img