విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ మరియు ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్స్ట్యూట్ వారి ఉమ్మడి ఆధ్వర్యములో శుక్రవారం పుట్టపర్తిలోని హ్యాపీ హోమ్ లో వున్న 22 మంది అనాథ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. వీరిలో 6 మంది పిల్లలకు కంటి అద్దాలు అవసరమని గుర్తించడం జరిగింది. అలాగే పుట్టపర్తి మండలం కర్ణాటనాగేపల్లి గ్రామంలోని హోలిసిటి మినిస్ట్రి ఆధ్వర్యంలో నడుస్తున్న హోమ్ 18 మంది పిల్లలకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 01 మంది కళ్ళజోడు అవసరమని గుర్తించడం జరిగింది.ఇదే గ్రామంలో వున్న ప్రేమధర్మ చారిటబుల్ ట్రస్ట్ హోమ్ లో వున్న 5 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించగా 2 మెంబెర్స్ కు కళ్ళజోడు అవసరమని తెలియచేయడం జరిగింది. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు ఉచితంగా కళ్ళజోడును అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి జిబి విశ్వనాథ, కో ఆర్డినేటర్ రమేష్, హ్యాపి హోమ్ నిర్వాహకులు రంజిత, హలండ్ దేశానికి చెందిన ఎలిజబెత్, టెక్నిషియన్లు రఫిక్, కృష్ణన్ పాల్గొన్నారు.