Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ఎఫ్. ఏ.సి ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నందు ఉన్న పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపల్ గా డా. కే. జయప్ప బాధ్యతులు స్వీకరించారు. ఈ మేరకు ఉన్నత విద్యా కమిషనర్ నుండి నియామక ఉత్తర్వులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రిన్సిపల్ గా పనిచేసిన డాక్టర్ నీలం రమేష్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఎఫ్ఎసి ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రిన్సిపల్ ఆశయాల కోసం సిబ్బంది సహకారంతో కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు దాతల సహకారంతో కళాశాలలో నూతన కోర్సులను ప్రవేశ పెట్టడం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు ఆయనకు కళాశాల సిబ్బంది మరియు లెక్చర్స్ శుభాకాంక్షలు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img