Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

వేరుశెనగ పొలంబడి కార్యక్రమం పై రైతులకు అవగాహన

వ్యవసాయ అధికారి ముస్తఫా

విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని పోతుల నాగేపల్లి గ్రామంలో గురువారం అక్కడి రైతులకు వేరుశనగ పొలంబడి కార్యక్రమం పై అవగాహనను నిర్వహించామని వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా పంటల విషయంపై పలు విషయాలను తెలుపుతూ క్రిమి సంహారక మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలు అదేవిధంగా ఆహారపు గొలుసులో ప్రవేశించడం వల్ల కలిగే అనర్థాలను వివరించడం జరిగిందన్నారు. తదుపరి వేరుశనగ పొలాలను కూడా వారు పరిశీలించారు. ప్రస్తుతం వేరుశనగ పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉందని ఈ దశలో పంటలను రసం పీల్చే పురుగులు పచ్చ పురుగులు ఆశించడం జరుగుతుందని వాటిని రైతులకు గుర్తించాలన్నారు. ఈ పురుగుల నివారణకు వేప నూనె 5 ఎమ్మెల్/లీటరు లేదా ఆసిపెట్ 1.5 గ్రాములు/లీటరు లేదా ఈ మీడ క్లోరైడ్0.4 ఎమ్మెల్/లీటర్తో పాటు ప్రొఫెనోపాస్ 2 ఎమ్మెల్/లీటరు నీటిని కలుపుకొని పిచ్చకారి చేసుకోవలసినదిగా వారు తెలిపారు. ఈ విధంగా చేయడం వలన పంట దిగుబడి తగ్గదని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏఏలు. పూర్ణిమ, చరిత,గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img