Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఆగస్టు 7 న ఛలో విజయవాడ రైతుల ధర్నాకు జిల్లా రైతులు కౌలు రైతులు తరలిరండి…

ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు…

విశాలాంధ్ర-గుంతకల్లు : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పోస్టర్లు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅథితులు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి.గోవిందు,రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి పి,రామాంజనేయులు యాదవ్ మాట్లాడుతూ…జిల్లా రైతులు వ్యవసాయం సాగు చేయాలంటే అష్ట కష్టాలు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జై జవాన్, జై కిసాన్, అనే నినాదాన్ని పక్కన పెట్టడం జరిగింది జవాన్ లు దేశాన్ని కాపాడటంలో ముందుంటే దేశానికి అన్నం పెట్టే రైతులు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యవసాయన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తూ రైతులు కడుపు మార్చుకుంటూ దేశానికి అహరముఅందిస్తున్నారు. అటువంటి వారిని విస్మరించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగదన్నారు. రైతులు తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేయాలని, తిరిగి వారికి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. రైతులకు సాగు సాయం కింద ఎకరాకు 10వేలు ఇవ్వాలన్నారు, పంట పెట్టినష్టపోయిన ప్రతిరైతుకు పంటల బీమా పంటనష్టపరిహరం అందించాలన్నారు.50 సంవత్సరాల నుండి ప్రతి రైతుకు ,నెలకు10,000 పెన్షన్ ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు.బిందు, తుంపెర సేద్యపరికరాలు విత్తనాలు ఏరువులు 90శాతము సబ్సిడీ తో ఇవ్వాలన్నారు.ధరల స్థీరికరణ నీది 3000 కోట్లు కేటాయించాలన్నారు. ప్రకృతి విపత్తుల నిధి సాయం కింద 4000 కోట్లు కేటాయించాలన్నారు. వ్యవసాయపనులకు ఉఫాదీ పనులు అనుసంధానం చేయాలన్నారు.అనేకమైన డిమాండ్లతో విజయవాడ కేంద్రంలో ఈ నెల 7 న ధర్నా చౌక్ యందు ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా రైతులు కౌలురైతులు తరలి వచ్చి మహాదర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రాము రాయల్, పట్టణ కార్యదర్శి గోపీనాథ్, పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ ,జనసేవ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి పీసీ కుల్లాయప్ప, గురుస్వామి ,రామంజి, నాగేంద్ర, చిన్న రామంజి, ఉదయ్ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img