Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మిర్చికి మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలి

విశాలాంధ్ర – ఉరవకొండ : మిర్చి పంటకు మద్దతు ప్రకటించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.బుధవారం ఉరవకొండ మండల పరిధిలోని రాయంపల్లి గ్రామ రైతులు ధర లేకపోవడంతో పొలాల్లోనే మిర్చిని నిల్వ ఉంచుకున్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం 45 వేల ఎకరాలలో మిరప పంట సాగు చేశారన్నారు. గత వారంలో మిర్చి క్వింటాల్ ధర 76వేలు ఉండేదని ప్రస్తుతం 35 వేలకు మిర్చి ధర పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటనలకే పరిమితమైందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులు పండించిన మిర్చి పంటతో పాటు అన్ని రకాల పంటలను రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మధుసూదన్, జ్ఞానమూర్తి,కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి, సీనప్ప,వెంకటేశులు,రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img