Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి : ఏఓ వెంకటేశ్వరప్రసాద్

విశాలాంధ్ర-రాప్తాడు ; ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు వర్షాభావం తక్కువ కావడం వల్ల వేరుశనగ పంట తక్కువ సాగు అయిందని, రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని ఏఓ వెంకటేశ్వరప్రసాద్ సూచించారు. సోమవారం వ్యవసాయ అధికారి పలు గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈఏడాది వర్షాభావం వల్ల ప్రధాన పంట వేరుశనగ 52% పరిమితమైనందున దాని స్థానంలో కంది, ఆముదం, మొక్కజొన్న పంటలకు ప్రాధాన్యం ఉన్నందున వాటిన సాగు చేసి సస్యరక్షణ సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా వర్షాభావంతో బెట్ట ఏర్పడినప్పుడు 5 గ్రాములు పొటాషియం నైట్రేట్ లేదా 5 గ్రాములు 19- 19 -19 లేదా ఒక గ్రాము యూరియా లీటర్ నీటికి కలిపి వారం రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేస్తే పంటలు ఆశాజనకంగా ఉంటాయన్నారు. కంది, ఆముదం, పత్తి ,మొక్కజొన్న, సజ్జ తదితర పంటలు ఆశించిన పురుగులు తెగుళ్లు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో పంట నమోదు ప్రక్రియ మొదలైంది కావున ప్రతి రైతు తప్పకుండా పంట వేసిన ప్రతి రైతు తప్పకుండా పంట నమోదు చేసుకోవాలని సూచించారు. సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని…అవసరమైన రైతులు అనగా పంట వేయని రైతులు ప్రత్యామ్నాయ విత్తనాలు వేసుకునే రైతులు మాత్రం వచ్చి విత్తనాలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img