Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

రైతులు సాగుచేసిన పంటలను నమోదు చేయించుకోవాలి

విశాలాంధ్ర ,ఎన్ పీ కుంట: ఖరీఫ్ సీజన్ 2023 సంబంధించి గ్రామాలలో రైతులు సాగుచేసిన పంటలకు తప్పనిసరిగా ఈ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ ఆధికారి లోకేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని రమణారెడ్డి పొలంలో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని ఏవో ప్రారంభించారు. మండలవ్యాప్తంగా 3567 హెక్టర్లు లో వివిధ రకాల పంటలను సాగు చేయడం జరిగిందని తెలిపారు..వర్షభావా పరిస్తులవలన సకాలంలో వర్షాలు రాకపోవడంతో పంటలు ఎండిపోయె పరిస్థితికి వచ్చాయని వివరించారు. ఈ ఏడాది ఖరీఫ్ రైతులకు కష్టాలను మిగిల్చిందని మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వై.ఆదిరెడ్డి వాపోయారు.అలాగే మండలానికి కంటింజెన్సీ ప్లాన్ క్రింద 80% సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేసే క్రమంలో మండలానికి 100 క్వింటాలు ఉలవలు ఇండెంట్ పెట్టడం జరిగిందన్నారు. పంట తప్పని సరిగా సాగు చేసే రైతులు మాత్రమే రైతు భరోసా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్బికే సిబ్బంది యుగంధర్ మరియు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img