Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను అధుకోవాలి

ఏపీ రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున

విశాలాంధ్ర-రాప్తాడు : ఇటీవల అనంతపురం జిల్లాలో కురిసిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం అధుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున డిమాండ్ చేశారు. గురువారం ఏపి రైతుసంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నగరంలోని ఐదుకల్లు రాజమ్మ భవనంలో జిల్లా అధ్యక్షుడు బి.గోవిందు అద్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి.మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ జిల్లాలో ఈఖరీఫ్ లో దాదాపుగా 12లక్షల ఎకరాలలో పంటలు నష్టపోయాయని ఈ-కేవైసీ, ఈ క్రాప్ అధారంగా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా కేవలం 9806 ఎకరాలలో రూ.16.63కోట్ల విలువ చేసే పంట నష్టపోయిందని వ్యవసాయ అధికారులు చెప్పడం దారుణమన్నారు. ఇప్పటీకైనా క్షేత్రస్థాయిలో పంటపోలాలను పరీశీలించి రైతులతో కలిసి జిల్లా వ్యవసాయ అధికారులు వివరాలు తెప్పించుకుని నష్టం అంచనా వేయాలన్నారు. అదేవిధంగా డ్రిప్పులు, స్ప్రింక్లర్ల ధరలపై రైతులపై భారం మోపుతున్న జీఎస్టీ మొత్తాన్ని ప్రభుత్వం విరమింపచేసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది పంటలు నష్టపోయి అర్జీలు ఇచ్చిన ప్రతి రైతుకు పంటల బీమా, నష్ట పరిహారం తదితర డిమాండ్లపై రైతుసంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో అర్గనైజింగ్ సెక్రటరీ వన్నారెడ్డి, జిల్లా ఉఫాధ్యక్షుడు గోపాల్, బండి రామక్రిష్ణ, జిల్లా కార్యవర్గసభ్యులు చలపతి, మగ్బూల్ బాషా, ఉమర్, శివారెడ్డి, నాగేశ్, రైతుసంఘం నాయకులు నాగరాజు, మనోహర్, రాము, గోపాల్, మారుతి, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img