Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ఆర్భీకేల్లో రైతులకు అందుబాటులో ఎరువులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ బుధవారం తెలిపారు. అన్ని కంపెనీల ఎరువులు ఒకటేనని అన్నింటిలో నిర్దేశించిన శాతం మూలకాలు ఉంటాయని, రైతులు అనవసరంగా కొన్ని కంపెనీ ఎరువులపై మోజు పెంచుకొవద్దని హితువు పలికారు. ఇప్పుడు ఎరువులు అన్నీ కంపెనీలకు అతీతంగా “భారత్ ” అనే పేరుమీద లభ్యమవుతున్నాయని, రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉండే అన్ని కంపెనీల ఎరువులను ఒకే దృష్టితో చూసి వినియోగించుకోవాలన్నారు. యూరియా మరియు ఇతర ఎరువులను ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఎరువు సంచులను నిర్ణీత సంఖ్యను మించి ఎవ్వరికీ ఇవ్వరాదనీ, ఆర్భీకేలలో ఎరువులు అయిపోయిన వెంటనే ఆర్డర్ చేయాలని రైతు భరోసా కేంద్ర సిబ్బందికి సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img