Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ప్రభుత్వ విద్యా పరిరక్షణకై పోరాడాలి

ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు నిరంజన్ గౌడ్

విశాలాంధ్ర- ఉరవకొండ : ప్రభుత్వ విద్య పరిరక్షణకై ఏఐఎస్ఎఫ్ పోరాటాలు నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ మాజీ విద్యార్థి సంఘం నాయకులు నిరంజన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం స్థానిక బీసీ హాస్టల్ ఆవరణలో నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో నూతన విద్యా విధానం పేరుతో విద్యను పూర్తిగా కాషాయకరణను మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. స్వతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులలో విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వత్తాసుగా పనిచేసిన సావర్కర్ చరిత్రను పాఠ్యాంశాల్లో తీసుకు రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలన్నారు. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని తక్షణమే ఆపాలన్నారు. జీవో నెంబర్ 117కు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పైన పోరుబాటు సాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించి రాష్ట్ర ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి చిరంజీవి నాయకులు నవీన్, చరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img