విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ పట్టణానికి చెందిన విద్యుత్ ఒప్పంద కార్మికుడు ఎర్రిస్వామి పక్షవాతానికి గురవడంతో అతనికి వ్యాసాపురం గ్రామానికి చెందిన వైయస్సార్ సిపి పార్టీ బీసీ విభాగం నాయకులు వాల్మీకి ఉలిగప్ప రూ.10వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కొన్ని నెలల నుండి ఇల్లు గడవడం కూడా కష్టం అవడంతో విషయం తెలుసుకున్న ఆయన అనారోగ్యానికి గురైన ఎర్రిస్వామి భార్య సా విత్రమ్మకు సీఐ శేఖర్ ఆధ్వర్యంలో నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఉలిగప్పను సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ వన్నప్ప పాల్గొన్నారు