Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

పాత్రికేయునికి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని చిన్న బజార్ లో ఉన్న ఐదో నెంబర్ బీడీ ఫ్యాక్టరీలో శుక్రవారం వైసిపి మైనార్టీ నాయకుడు, ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష పాత్రికేయుడు కరీముల్లాకు 10వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఫయాజ్ భాష మాట్లాడుతూ పాత్రికేయుడు కరీముల్లా తల్లి మృతి చెందడం బాధ కరమైన విషయం అన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంటి పెద్దని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాత్రికేయుడు కరీముల్లా కుటుంబానికి ఉడత భక్తిగా తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందజేశానన్నారు. వక్ బోర్డు అధ్యక్షుడు షాషావలి వైసీపీ నాయకులు రియాజ్, చవ్వ గోపాల్ రెడ్డి కౌన్సిలర్ భాష పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img