Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కిడ్నీ బాధితు రాలికి ఆర్థిక సహాయం

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 24 వ వార్డు పార్థసారధి నగర్ కు చెందిన నారాయణస్వామి, హేమావళి దంపతుల కుమార్తె విమల గత కొన్ని నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉంది. సమాచారం అందుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి మంగళవారం వారి ఇంటి కి స్వయంగా వెళ్లి ,తన వంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం అందజేశారు. మున్ముందు కూడా దాతల ద్వారా మరింత సహాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇలాంటి బాధితులని పట్టణములోని దాతలు ఎంతైనా ఆదుకోవాలని వారు కోరారు. అనంతరం కుటుంబ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img