Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పేద వృద్ధురాలికి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని ఐదవ వార్డుకు చెందిన పేద వృద్ధురాలికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సహకారంతో 10వేలు ఆర్థిక సాయం అందించినట్లు కాలనీ ప్రజలు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిధిలోని 5వ వార్డ్ లో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న షేఖాన్ బి తన పరిస్థితిని ఈనెల 8వ తేదీ 5వ వార్డ్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాలనీలో తిరుగుతూ ఉన్న సందర్భంలో ఆ కాలనీ వృద్ధురాలు అయిన షేఖాన్ బి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నదని కాలనీలోని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించి ఎమ్మేల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి షేఖాన్ బి కి 10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. వృద్ధురాలికి ఆర్థిక సాయం అందజే యడంతో ప్రజలు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్, డివి కుమార్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img