Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

కుటుంబానికి ఆర్థిక సహాయం

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సతీమణి సుప్రియ
విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఎనిమిదవ వార్డుకు చెందిన బేల్దారి శ్రీనివాసులు ఈనెల 21వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. సమాచారాన్ని అందుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం సోమవారం ఎమ్మెల్యే స్వగృహంలో ఆ కుటుంబ సభ్యులకు తన వంతుగా 20వేల రూపాయల ఆర్థిక సాయం ఎమ్మెల్యే సతీమణి సుప్రియ చేతుల మీదుగా అందజేశారు. తదుపరి సుప్రియ కుటుంబ సభ్యులను ఓదార్చు ధైర్యంగా ఉండాలని వారు తెలియజేశారు. మీ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటూ, ఆదుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img